ఎస్..కేసీఆర్ కుటుంబ పాలన సాగుతుంది – కేటీఆర్
- February 04, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనా కొనసాగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు. తమది ముమ్మాటికీ.. కుటుంబపాలనే అని, తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులేనని, సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్ద అని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని కేటీఆర్ అన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అయితుండని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని 4కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని తెలిపారు. 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచాడని చెప్పుకొచ్చారు. ఇలా అన్ని చేస్తూ వస్తున్నాడు కాబట్టే దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని..తమకు కూడా అండగా ఉండమని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







