పింక్ కారవాన్ రైడ్: దుబాయ్ లో కీలక రోడ్లు మూసివేత
- February 05, 2023
యూఏఈ: పింక్ కారవాన్ రైడ్ నేపథ్యంలో దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(RTA) ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. ఫిబ్రవరి 5న పలు కీలక రహదారులను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలిపింది. అలాగే పలు కీలక రహదారులలో ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనను కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న పింక్ కారవాన్ రైడ్ దుబాయ్ లో సాగే ర్యాలీను మూడు స్టేజీలుగా విభజించారు. పింక్ ర్యాలీ సాగే సమయాల్లో రహదారులు మూసివేయనున్నట్లు ఆర్టీఏ తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని కోరింది.
స్టేజ్ 1: ఉదయం 8 నుండి 10.30 వరకు
ప్రభావిత రహదారులు: అల్ సుకూక్ స్ట్రీట్, అల్ బౌర్సా స్ట్రీట్, అల్ ముస్తక్బాల్ స్ట్రీట్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ Blvd, అల్ యమామా స్ట్రీట్
స్టేజ్ 2: 11.15am నుండి 1pm వరకు
ప్రభావిత రహదారులు: కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ స్ట్రీట్, ది వాక్ ఎట్ JBR.
స్టేజ్ 3: మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు
ప్రభావిత రహదారులు: అల్ ముల్తాకా 1 స్ట్రీట్, అల్ ఎంజాజ్ స్ట్రీట్, హ్యాపీనెస్ స్ట్రీట్, అల్ మదీనా స్ట్రీట్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







