చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన అమెరికా
- February 05, 2023
చైనా: చైనాకు చెందిన స్పై బెలూన్ ను అమెరికా ఎట్టకేలకు కూల్చేసింది. అమెరికా గగనతలంలో ఆ బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. మిలటరీ స్థావరాలపై అది నిఘా పెట్టింది. ఆ అతి పెద్ద బెలూన్ ను కూల్చితే ప్రజలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని భావించిన అమెరికా దాన్ని నిన్న, మొన్న నిశితంగా పరిశీలించింది. అది మోంటానా రాష్ట్ర గగనతలంలో కొన్ని రోజులుగా ఉంది.
చివరకు దాన్ని కొన్ని గంటల క్రితం ఆ బెలూన్ ను తమ దేశ యుద్ధ విమానాల సాయంతో సముద్రతలాల వైపునకు తీసుకొచ్చి పేల్చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై చైనా స్పందించింది. మానవరహిత బెలూన్ ను పేల్చివేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ చెప్పింది. కాగా, బెలూన్ ను పేల్చిన దృశ్యాలను అమెరికా వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి.
ఎఫ్-22 యుద్ధ విమానాన్ని వాడి ఆ బెలూన్ ను పేల్చినట్లు వివరించాయి. దక్షిణ కాలిఫోర్నియా మర్టల్ బీచ్ ప్రాంతంలో ఆ బెలూన్ శకలాలు పడ్డాయి. వాటిని సేకరించేందుకు మిలటరీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, చైనా మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ బెలూన్ కలకలం రేపడం గమనార్హం.
తైవాన్ విషయంతో పాటు చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. చైనా బెలూన్ ను అమెరికా మిలటరీ విమానం నుంచి కూడా అధికారులు ముందుగా పరిశీలించారు. ఈ విషయాన్ని చైనా అధికారుల ముందు కూడా అమెరికా అధికారులు లేవనెత్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







