నకిలీ ఇన్వాయిస్లతో కార్యాలయం నుంచి Dh431,000 చోరీ
- February 05, 2023
యూఏఈ: పనిచేసిన కంపెనీ నుండి 431,932 దిర్హామ్లను దొంగిలించడానికి నకిలీ ఇన్వాయిస్లను ఉపయోగించిన ఉద్యోగిని దోషిగా కోర్టు తేల్చింది. అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ వ్యక్తి తన మాజీ యజమాని నుండి అపహరించిన నగదును తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. కంపెనీ అకౌంట్స్ విభాగంలో పనిచేసే తన మాజీ ఉద్యోగి నకిలీ ఇన్ వాయిస్ లను ఉపయోగించి నిధులను కాజేసిండని కంపెనీ దావా వేసింది. కాజేసిన 431,932 దిర్హామ్లతోపాటు నష్టపరిహారం కింద 120,000 దిర్హాములను ఇప్పించాలని కంపెనీ తన దావాలో డిమాండ్ చేసింది. అబుదాబి క్రిమినల్ కోర్ట్ అంతకుముందు సదరు ఉద్యోగిని దోషిగా నిర్ధారించి, అపరాధ రుసుముతో శిక్ష విధించింది. కంపెనీకి జరిగిన నష్టాలకు తాత్కాలిక పరిహారంగా 51,000 దిర్హామ్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసును పరిశీలించిన సివిల్ కోర్టు న్యాయమూర్తి ఆ వ్యక్తి కంపెనీ నుండి దొంగిలించిన 431,932 దిర్హామ్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కంపెనీ చట్టపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







