అనధికారిక వాతావరణ సమాచార ప్రచురణపై ఒమన్ నిషేధం

- February 05, 2023 , by Maagulf
అనధికారిక వాతావరణ సమాచార ప్రచురణపై ఒమన్ నిషేధం

మస్కట్: అనధికారిక వాతావరణ డేటాను ప్రచురించడంపై నిషేధంతో సహా పౌర విమానయాన చట్టం కోసం పౌర విమానయాన అథారిటీ (CAA) కార్యనిర్వాహక నిబంధనలను జారీ చేసింది. రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, పౌర విమానయాన అథారిటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ హిస్ ఎక్సెలెన్సీ సయీద్ అల్ మావాలి, పౌర విమానయాన చట్టం కోసం కార్యనిర్వాహక నిబంధనలను వివరిస్తూ నిర్ణయం నెం. 116/2023 జారీ చేశారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో విమాన నిర్వహణ సంస్థలు, విమానయాన సంబంధిత సేవలను అందించే ఏదైనా సంస్థలతో పాటు, విమానం, విమానాశ్రయాలు, ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లు, ఎయిర్ నావిగేషన్ సేవలకు సంబంధించిన అన్ని రంగాల కార్యకలాపాలకు నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  పౌర విమానయాన అథారిటీ పౌర విమానయాన భద్రత కోసం జాతీయ కార్యక్రమం, ఎయిర్‌స్పేస్ ప్లానింగ్ కోసం జాతీయ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వాయు రవాణా సౌకర్యాల కోసం జాతీయ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేయాలని నిబంధనలు పేర్కొన్నాయి. విమానాశ్రయాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని భూ వినియోగం, భవనాలు,  లైట్ల కోసం అధికార యంత్రాంగం నియంత్రణలను నిర్దేశిస్తుందని, భూ వినియోగాలకు సంబంధించిన అన్ని సమస్యలను అధ్యయనం చేయడానికి, పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా తాజా ఉత్తర్వుల్లో నిర్దేశించారు. అథారిటీ నుండి పొందినవి కాకుండా ఏదైనా వాతావరణ సమాచారం లేదా డేటాను ప్రచురించకుండా అన్ని మీడియా అవుట్‌లెట్‌లను నియంత్రణ నిషేధిస్తుంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com