సిరియా, టర్కీలకు $100-మిలియన్ల సహాయ నిధిని ప్రకటించిన యూఏఈ

- February 08, 2023 , by Maagulf
సిరియా, టర్కీలకు $100-మిలియన్ల సహాయ నిధిని ప్రకటించిన యూఏఈ

యూఏఈ:  భూకంపాల వల్ల కకావికలమైన సిరియన్ అరబ్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ టర్కీలకు యూఏఈ అండగా నిలబడింది. భూకంపాల వల్ల నష్టపోయిన వారి సహాయానికి $100 మిలియన్లను అందించాలని ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. ఇందులో సిరియన్ ప్రజలకు $50 మిలియన్లు, టర్కిష్ ప్రజలకు $50 మిలియన్లు అందించనున్నారు. ఈ అంతర్జాతీయ చొరవ యూఏఈ మనవతా ప్రయత్నాలను, స్నేహపూర్వక సమాజాలకు సహాయ హస్తాన్ని ప్రతిబింబిస్తోందని యూఏఈ ప్రభుత్వం ఒక ప్రకటలలో తెలిపింది. యూఏఈ అధ్యక్షుడి ఆదేశానుసారం.. టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడానికి ఇప్పటికే యూఏఈకి చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు పనిచేస్తున్నాయి. అలాగే భూకంప బాధితుల సహాయార్థం ఫీల్డ్‌ హాస్పిటల్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా సిరియా, టర్కీ ప్రజలకు సహాయం అందించడానికి "గాలంట్ నైట్ / 2" ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో సాయుధ దళాల భాగస్వామ్యం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్, ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ లు సంయుక్తంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com