ఈయూ దేశాలకు వెళ్లే యూఏఈ నివాసితులకు గుడ్ న్యూస్

- February 08, 2023 , by Maagulf
ఈయూ దేశాలకు వెళ్లే యూఏఈ నివాసితులకు గుడ్ న్యూస్

యూఏఈ: స్కెంజెన్(Schengen ) దేశాలకు వెళ్లాలనుకునే యూఏఈ నివాసితులు  భవిష్యత్తులో తమ వీసాలను ప్రాసెస్ చేయడానికి అపాయింట్‌మెంట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. క్యూలో గంటల తరబడి నిలబడి పాస్‌పోర్ట్‌లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఒక నివేదిక ప్రకారం..  27 ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులు త్వరలో తమ వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసా ప్రక్రియను డిజిటలైజ్ చేసే ప్రణాళికలు తుది దశకు చేరుకున్నట్లు సదరు నివేదికలో తెలిపారు. ఎమిరేట్స్‌లోని నివాసితులు, ప్రయాణ ఏజెన్సీలు స్కెంజెన్ వీసాల కొత్త, అవాంతరాలు లేని డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి ఆశాజనకంగా, ఉత్సాహంగా ఉన్నారు. గత వారం స్కెంజెన్ వీసా ఇన్ఫోలో ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిజికల్ అప్లికేషన్‌లు, వీసా స్టిక్కర్‌లను డిజిటల్ ప్రాసెస్‌తో భర్తీ చేయనున్నారు. స్కెంజెన్ ప్రాంతాలకు వీసా దరఖాస్తు ప్రక్రియను ఆధునీకరించాలని కోరుతున్న నివేదికను యూఏఈ పార్లమెంట్ సభ్యులు ఆమోదించారు. ఇక ఈయూ పార్లమెంట్ ఫైల్‌పై ఇంటర్‌ఇన్‌స్టిట్యూషనల్ చర్చల జరిగే సమయంలో ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే వీసా ప్రక్రియ డిజిటల్ ప్రాసెస్ అమల్లోకి వస్తుంది. తాబేలు ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బజాజ్ మాట్లాడుతూ.. యూరప్‌ను ప్రమోట్ చేయడంలో ఇది గొప్ప ముందడుగు అని అన్నారు. వీసా దరఖాస్తు కోసం అపాయింట్‌మెంట్ పొందడం కొన్నిసార్లు అంత సులభం కాదని, కానీ తాజా ప్రయత్నం ఈ ప్రక్రియను సులువు చేస్తుందన్నారు. పాస్‌పోర్టు ఇవ్వడం, వీసా స్టాంప్‌ కోసం గంటల తరబది ఎదురుచూడడం తప్పుతుందని గౌతమ్‌ అన్నారు. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే యూఏఈ ప్రజలు ఈయూ దేశాలకు వెళ్లడానికి ఎక్కువ మొగ్గు చూపుతారని ఆయన అన్నారు. వేసవి సమీపిస్తున్నందున, ఆన్‌లైన్‌లో వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడం గొప్ప ముందడు అని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com