టర్కీ, సిరియాలలో 17500 దాటిన మరణాలు.. మస్జీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
- February 09, 2023
యూఏఈ: దేశంలోని అన్ని మస్జీదుల్లో జుమా ప్రార్థనలు (శుక్రవారం ప్రార్థనలు) తర్వాత టర్కీ, సిరియాలో భూకంపాల బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.మరో వైపు టర్కీ, సిరియాను తాకిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 17,500 దాటింది.టర్కీలో 14,351 మంది, సిరియాలో 3,162 మంది మరణించారని, మొత్తం 17,513కు చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు. భూకంపాల వల్ల నష్టపోయిన వారి సహాయానికి 100 మిలియన్ డాలర్లు అందించాలని షేక్ మహ్మద్ ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితులకు సహాయం చేయడానికి ఫీల్డ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు బాధిత ప్రజలకు సహాయం చేయడానికి UAE ఇప్పటికే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లను కూడా పంపింది.ఇదిలా ఉండగా, అబుధాబిలోని టర్కీ రాయబార కార్యాలయం కూడా భూకంప విపత్తులో నష్టపోయిన వారి కోసం సహాయాన్ని సేకరించింది. విపత్తు బాధితులకు విరాళం ఇవ్వాలనుకునే UAE నివాసితులు రాయబార కార్యాలయంతో పాటు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్, టర్కిష్ రెడ్ క్రెసెంట్, యునిసెఫ్, ఇతరుల ద్వారా విరాళం ఇవ్వవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







