పవన్ కళ్యాణ్ ‘వినోదయ సితం’ మొదలెట్టేస్తారా.?
- February 10, 2023
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వినోదయ సితం’ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
కాగా, ఈ సినిమాని ఒరిజినల్ డైరెక్టర్ అయిన సముద్రఖని తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు కానీ, ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించి వీలైనంత త్వరలోనే పూర్తి చేసేసే యోచనలో టీమ్ వున్నట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ అందుకు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయట. పవన్ కళ్యాణ్ చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ సినిమాకి డేట్స్ కేటాయించారట. ఆ టైమ్‌లోనే సినిమాని పూర్తి చేసేందుకు అన్నీ సిద్ధమయ్యాయనీ రేపో మాపో సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







