మొత్తానికి పూరీ మెగా కోరిక నెరవేరబోతోందా.?
- February 10, 2023
మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయాలన్న పూరీ కోరిక చాలా కాలంగా తీరనే తీరడం లేదు. అప్పుడెప్పుడో ‘ఆటో జానీ’ అనే టైటిల్‌తో పూరీ జగన్నాధ్, చిరంజీవికి ఓ కథ చెప్పాడు. అందులో చిన్నా చితకా మార్పులు చేసుకు రమ్మని పూరీకి సూచించాడు మెగాస్టార్ చిరంజీవి.
చాలా కాలం అయినా కానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇటీవల ‘గాడ్ ఫాదర్’ సినిమాలో పూరీ జగన్నాధ్‌కి ఓ ఇంపార్టెంట్ స్సెషల్ రోల్ ఇచ్చి మెగాస్టార్ తనకు బాగా దగ్గర చేసుకున్నాడు. ఆ కనెక్షన్‌తోనే సందట్లో సడేమియా అన్నట్లుగా తన వద్ద వున్న స్టోరీని చిరుకు వినిపించాడట పూరీ.
చిరంజీవి ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యందనీ సమాచారం. అయితే, అధికారికంగా ఇంకా బయటికి రాలేదీ వార్త. త్వరలోనే వన్ ఫైన్ డే ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నాడట పూరీ జగన్నాధ్.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







