తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
- February 11, 2023
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగింది.గత ఏడాదితో పోల్చితే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో శుక్రవారం (ఫిబ్రవరి 10,2023) కంటే శనివారం (ఫిబ్రవరి 11,2023) అత్యధిక విద్యుత్ ను వినియోగించారు. శనివారం ఉదయం 10 గంటల వరకు 14 వేల 350 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు.శుక్రవారం (ఫిబ్రవరి10,2023) సాయంత్రం 4 గంటలకు వరకు 14 వేల 169 యూనిట్లుగా నమోదు అయింది.
గత ఏడాది ఇదే రోజున 11 వేల 420 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు.ఈ ఏడాది మే నెల వరకు రోజువారి విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాగు విస్తీర్ణ పెరుగడంతోపాటు పారిశ్రామిక అసవరాలు పెరిగిన నేపత్యంలో శుక్రవారం (ఫిబ్రవరి10,2023)తో పోల్చితే శనివారం ( ఫిబ్రవరి 11,2023) 14 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది.
శుక్రవారం (ఫిభ్రవరి 10,2023) ఇదే సమయానికి 14 వేల 169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడగా శనివారం (ఫిబ్రవరి11,2023) తాజాగా ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ రికార్డు స్థాయిలో 14 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయింది.ఈ డిమాండ్ కూడా మధ్యాహ్నం తర్వాత మరింత పెరిగే అవకాశమున్నట్లు విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చి నెలలో 14 వేల 160 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే గతేడాది రికార్డును అధిగమించినట్లుగా చెప్పవచ్చు.
ఈ సారి వేసవిలో కూడా 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరముందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు.రానున్నది వేసవి కాలంగా కాబట్టి సాగు విస్తీర్ణంతోపాటు గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ఇటు తెలంగాణ డిస్కంలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







