ఎయిర్ ఏషియాకు 20 లక్షల జరిమానా: DGCA
- February 11, 2023
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థకు 20 లక్షల జరిమానా విధించారు. పైలట్ శిక్షణలో లోపం ఉన్నట్లు ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ సంస్థ పేర్కొన్నది. పైలట్ నైపుణ్యం చెకింగ్ సమయంలో ఎయిర్ ఏషియా పైలట్ తన స్కిల్స్‌ను ప్రదర్శించలేకపోయినట్లు డీజీసీఏ తెలిపింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ రూల్స్ ప్రకారం ఆ పైలట్ పర్ఫార్మ్ చేయలేకపోయాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఎయిర్ ఏషియాపై డీజీసీఏ జరిమానా వేసింది.
ఎయిర్ ఏషియాకు చెందిన ట్రైనింగ్ హెడ్‌ను కూడా మూడు నెలల పాటు ఆ పొజిషన్ నుంచి తొలగించారు. డీజీసీఏ ఏవియేషన్ రూల్స్ ఉల్లంఘించిన కేసులో అతనిపై కూడా వేటు వేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిపై మూడు లక్షల చొప్పున ఫైన్ వేశారు. రెగ్యులేటరీ నిబంధనలను విస్మరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదు అని డీజీసీఏ విమాన సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక సమాధాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా వేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







