అబుధాబి, దుబాయ్, షార్జాలో సిద్ధమైన 16,000 రిలీఫ్ బాక్స్‌లు
- February 12, 2023
యూఏఈ: కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖతో పాటు దేశంలోని ఛారిటీ ఫౌండేషన్ల సమన్వయంతో ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) నిర్వహించే “బ్రిడ్జెస్ ఆఫ్ గివింగ్” ప్రచారం శనివారం ప్రారంభమైంది. సిరియా, టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన వారికి ఉద్దేశించిన అత్యవసర సహాయాన్ని సిద్ధం చేయడానికి, ప్యాకేజీ సిద్ధం అవుతుంది. అబుధాబి, దుబాయ్, షార్జాలలో ఎయిడ్ బాక్సుల తయారీ, ప్యాకేజింగ్ కోసం ఏర్పాటు చేయబడిన కేంద్రాలలో స్వచ్ఛంద సేవకులు, వివిధ దేశాలకు చెందిన సొసైటీ సభ్యులు, ప్రజలు, నివాసితులు స్వచ్ఛందంగా ప్యాకేజింగ్ చేయడంలో పాలు పంచుకుంటున్నారు.
అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (ADNEC)లో, ERC చైర్మన్ డాక్టర్ హమ్దాన్ ముసల్లం అల్ మజ్రూయి, యూఏఈలోని సిరియా రాయబారి డాక్టర్ ఘసన్ అబ్బాస్, యూఏఈలోని టర్కీ రాయబారి తుగే టున్సర్ సహాయం చేసేందుకు వాలంటీర్లు తరలిరావాలని అంతకుముందు పిలుపునిచ్చారు. డాక్టర్ హమ్దాన్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. వాలంటీర్లు పని ప్రారంభించిన కొద్ది గంటల్లో, మూడు రకాల సహాయ పెట్టెలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు స్వచ్ఛంద బృందాలు 16,000 సహాయ పెట్టెలను సిద్ధం చేశాయి. అబుధాబిలో 7,000, దుబాయ్‌లో 6,000, షార్జాలో 3,000 బాక్సులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. అబుధాబిలోని ERC సెంటర్ డైరెక్టర్ సేలం అల్ సువైదీ మాట్లాడుతూ.. వాలంటీర్ల సంఖ్య ఇప్పటివరకు 2,000 మందికి చేరుకుందని, మొదటి గంటలోనే సిరియా, టర్కీకి అత్యవసరంగా పంపడానికి ఉద్దేశించిన 16,000 పెట్టెల్లో ప్యాకేజింగ్, అత్యవసర పదార్థాలను సిద్ధం చేశారన్నారు. తాము అబుదాబిలో 9, అల్ ఐన్లో 2 సహా అబుధాబి ఎమిరేట్‌లో విరాళాలు స్వీకరించడానికి 11 కారవాన్లను ఏర్పాటు చేసినట్లు అల్ సువైదీ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







