ఒమన్‌లో 82% పెరిగిన హోటళ్ల ఆదాయం
- February 12, 2023
మస్కట్: 3 నుండి 5 నక్షత్రాల రేటింగ్ ఉన్న హోటళ్ల మొత్తం ఆదాయం 2022 డిసెంబర్ చివరి నాటికి 82.7 శాతం పెరిగి OMR185,772కు చేరింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన నెలవారీ స్టాటిస్టికల్ బులెటిన్ ప్రకారం.. హోటల్లలోని అతిథుల సంఖ్య 2021లో ఇదే కాలంతో పోలిస్తే 2022 డిసెంబర్ చివరి వరకు 33.6 శాతం పెరిగింది. ఆక్యుపెన్సీ రేటు డిసెంబర్ 2022 చివరి వరకు 17.6 శాతం వృద్ధిని నమోదు చేసి 2021లో 38.3 శాతంతో పోలిస్తే 45 శాతానికి చేరుకుంది. అదే సమయంలో గల్ఫ్ అతిథుల సంఖ్య 304 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 2021 చివరి నాటికి 39,689 మంది నుండి 2022 డిసెంబర్ చివరి వరకు 160,340కి చేరుకుంది. యూరోపియన్ పర్యాటకుల సంఖ్య డిసెంబర్ 2021 చివరి నాటికి 105, 558 నుండి 360, 339కి పెరిగింది. డిసెంబర్ 2021 చివరి వరకు 241.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. అమెరికన్ పర్యాటకుల సంఖ్య విషయానికొస్తే, ఇది డిసెంబర్ 2022 చివరి వరకు 60,148 మందికి చేరింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 165.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అయితే ఒమానీల సంఖ్య 14.1 శాతం తగ్గింది. డిసెంబర్ 2021 నాటికి వీరి సంఖ్య 814,518 ఉండగా.. డిసెంబర్ 2022కు 699,937కి పడిపోయింది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







