ఒమన్ ‘సామాజిక రక్షణ’ చట్టంపై సర్వత్రా హర్షం
- February 16, 2023
మస్కట్: సామాజిక రక్షణపై ముసాయిదా చట్టంపై ఒమన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒమన్ కౌన్సిల్‌కు సామాజిక రక్షణపై ముసాయిదా చట్టాన్ని నిన్న మంత్రుల మండలి రిఫరల్ చేసిన విషయం తెలిసిందే. ఒమన్ విజన్ 2040 ప్రకారం ఒమానీ ప్రజల సంక్షేమం కోసం హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అందించిన ప్రత్యేక చొరవను కొత్త చట్టం ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. సామాజిక రక్షణ ముసాయిదా చట్టం సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఒమన్ సుల్తానేట్‌లోని పౌరులు, నివాసితులకు సామాజిక రక్షణ మరియు పదవీ విరమణ ప్రయోజనాలను అందించడాన్ని ప్రతిపాదిస్తుంది. షురా కౌన్సిల్ కార్యాలయ సభ్యుడు జిహాద్ బిన్ అబ్దుల్లా అల్ ఫన్నా అల్ షబీబా రేడియోతో మాట్లాడుతూ.. కొత్త చట్టం ద్వారా ప్రయోజనాలు ఇప్పుడు అర్హులైన వారికి నేరుగా చేరుకుంటాయన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ, స్వయం ఉపాధి కార్మికులు, హస్తకళాకారులు మరియు తక్కువ-ఆదాయ కుటుంబాల వారు ప్రయోజనాలను అందుకుంటారని పేర్కొన్నారు. ఇది యువకులకు కొత్త అవకాశాలను కూడా కల్పిస్తుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







