యూఏఈ రెసిడెన్సీ వీసా హోల్డర్లకు రీ-ఎంట్రీ పర్మిట్: Dh100 నుండి జరిమానాలు
- February 16, 2023
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ఇటీవల ప్రారంభించిన కొత్త రీఎంట్రీ పర్మిట్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఆరు నెలలకు పైగా దేశం వెలుపల ఉన్న చాలా మంది UAE రెసిడెన్సీ వీసా హోల్డర్లు రీఎంట్రీ పర్మిట్ ద్వారా తిరిగి వస్తున్నారు. సాధారణంగా, ప్రవాస నివాసితులు యూఏఈ వెలుపల 180 రోజులకు పైగా నిరంతరంగా ఉంటే, వారి రెసిడెన్సీ వీసాలు ఆటోమెటిక్ గా రద్దవుతాయి. కొత్త సేవతో, అటువంటి నివాసితులు తిరిగి రావడానికి ప్రవేశ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైమరీ వీసా హోల్డర్లు మరియు వారి కుటుంబాలు అదే రెసిడెన్సీపై యూఏఈలోకి రీఎంట్రీ కావచ్చు. దుబాయ్‌కి చెందిన రీగల్ టూర్స్‌కు చెందిన సుబైర్ మాట్లాడుతూ.. రెండు వారాల్లో 20కి పైగా రీ-ఎంట్రీ పర్మిట్ల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు.
జరిమానాలు, రుసుములు
రీఎంట్రీ పర్మిట్ సేవను పొందేందుకు మొత్తం ఖర్చు దేశం వెలుపల బస చేసిన సమయంపై ఆధారపడి ఉంటుంది. యూఏఈ వెలుపల గడిపిన ప్రతి 30 రోజులకు లేదా అంతకంటే తక్కువ ధరకు Dh100 జరిమానా విధించబడుతుంది. ICA రుసుము సుమారు Dh150 ఉంటుంది. వీటికి ట్రావెల్ ఏజెంట్ల ఛార్జీలు అదనం. దరఖాస్తును తప్పనిసరిగా యూఏఈ వెలుపల నుండి సమర్పించాలని ICP పేర్కొంది. అనుమతి వచ్చిన దరఖాస్తుదారు తప్పనిసరిగా 30 రోజులలోపు యూఏఈలోకి ప్రవేశించాలి.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







