గురక ఎందుకొస్తుంది.? ఏం చేయాలి.?
- February 16, 2023గురక అనేది చాలా సాధారణమైన సమస్య. కానీ, కొన్ని సమయాల్లో ఇది తీవ్రమైన సమస్యగానూ పరిణమిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గురకను తీవ్రమైన సమస్యగానే పరిగణిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైన వైద్య చికిత్సలు సైతం అందుబాటులో వుంటున్నాయ్.
అయితే, తాత్కాలికంగా గురక నుంచి విముక్తి పొందడానికి కొన్ని వంటింటి చిట్కాలున్నాయ్ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లంలో జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలుంటాయ్. అలసటను దూరం చేయడానికి ఇవి తోడ్పడతాయ్. గురక బాగా ఎక్కువగా వస్తున్న వాళ్లు రాత్రి పడుకునే ముందు అల్లం టీ తాగితే మంచిది.
పసుపులో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడంలో పసుపు తోడ్పడుతుంది. ముక్కు మూసుకుపోవడం గురకకు ప్రధానమైన కారణాల్లో ఒకటి. అందుకే రాత్రి పూట పసుపు కలిపిన పాలు తాగడం మంచిది.
అలాగే, పడుకునే ముందు కాస్త తేనె నాలుకకు రాసుకోవడం వల్ల ఉపశమనం వుంటుందట.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత