ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు: వీసీ సజ్జనార్
- February 16, 2023
వరంగల్: టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గురువారం వరంగల్ పర్యటనకు విచ్చేశారు.ఆర్టీసీకి ఆర్ధిక పరిపుష్టిని తీసుకురావడంతో పాటు నష్టాలను అధిగమించడంపై విసి సజ్జనార్ ఫోకస్ చేసిన మేరకు జిల్లా పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ రీజియన్ ను లాభాల బాట పట్టించేందుకు ఉన్న అవకాశాలు, ఆర్టీసీకి అదనపు ఆదాయవనరులు సమకూర్చుకొనే ప్రయత్నాలతో పాటు, ఆర్టీసీని గాడిలో పెట్టె పనుల్లో సజ్జనార్ నిమగ్నమయ్యారు. ఉద్యోగుల్లోను జవాబుదారితనంను పెంచడం, ఆర్టీసీ బస్సు ఆక్యుపెన్సీ రేషియోను పెంచడం,అలాగే బస్సులకె ఎంపిఎల్ ను పెంచడంపై దృష్టి సారించారు. అంతేగాక హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించి, ప్రయాణీకులకు కల్పిస్తున్న వసతులపై విసి సజ్జనార్ ఆరా తీశారు. ప్రయాణీకుల అవసరాలను తీరుస్తూ, సగటు ప్రయాణీకుల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ముందడుగేస్తున్నట్లు సజ్జనార్ స్పష్టం చేశారు. హన్మకొండకు వచ్చిన ఆర్టీసీ విసి అండ్ ఎండిని హన్మకొండ సిఐ శ్రీనివాస్ జీ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







