టర్కీ, సిరియాకు QR253 మిలియన్ల అత్యవసర సాయం: ఖతార్
- February 17, 2023
దోహా: టర్కీ, సిరియాలోని భూకంప బాధితులకు అత్యవసర మానవతా సహాయం కింద QR253 మిలియన్లు అందిస్తుందని ఉప ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రి , విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి డా. మజేద్ మహ్మద్ అల్ అన్సారీ తెలిపారు. భూకంప బాధిత దేశాలలోని బాధితులకు ఆహారం, వైద్యం, ఇతర సహాయం కొనసాగిస్తామన్నారు. అలాగు ఆయా దేశాల్లో జరుగుతున్న రెస్క్యూ ప్రయత్నాలకు మద్దతు కొనసాగుతుందన్నారు.
తుర్కీ, ఉత్తర సిరియాలో భూకంపం ప్రభావంతో ప్రభావితమైన సోదరులకు ఖతార్ విపత్తు జరిగిన మొదటి 10 రోజులలో QR85 మిలియన్లు అందించదని తెలిపారు. "ఔన్ వా సనద్" పేరుతో "రెగ్యులేటరీ అథారిటీ ఫర్ ఛారిటబుల్ యాక్టివిటీస్ (RACA) ప్రారంభించిన భూకంప బాధితుల కోసం HH అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ QR50 మిలియన్ల విరాళం ఇవ్వడంతో QR 168 మిలియన్లు సమకూరాయని వివరించారు.
ఎయిర్ బ్రిడ్జ్ విమానాల సంఖ్య ఇప్పటివరకు 30కి చేరుకుందని, 600 టన్నులకు పైగా ఆహారం, వైద్యం మరియు మానవతా సహాయాన్ని తీసుకువెళ్లామని, మొత్తం 10,000 మొబైల్ ఇళ్లలో 650 మొబైల్ హోమ్‌ల రెడీమేడ్ హౌసింగ్ యూనిట్లను రవాణా చేశామని ఆయన చెప్పారు. బాధితులను రక్షించడానికి, సహాయం చేయడానికి, సిరియన్ సివిల్ డిఫెన్స్ (వైట్ హెల్మెట్లు) కార్యకలాపాలకు మద్దతునిచ్చే అభివృద్ధి కోసం ఖతార్ ఫండ్‌తో పాటు, వీలైనంత త్వరగా టర్కీ ఓడరేవులకు రవాణా చేయడానికి, పంపిణీ చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!







