వీడియో: అజ్మాన్‌ ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

- February 17, 2023 , by Maagulf
వీడియో: అజ్మాన్‌  ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

యూఏఈ: అజ్మాన్‌లోని ఆయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3.30 గంటలకు కర్మాగారంలో మంటలు చెలరేగి వ్యాపించాయని అజ్మాన్ పోలీసులు తెలిపారు. నివాస భవనం, ప్రింటింగ్ ప్రెస్, గిడ్డంగులు, అనేక కార్లు ఈ ప్రమాదంలో దగ్ధం అయినట్లు వెల్లడించారు.  దుబాయ్, షార్జా,ఉమ్ అల్ క్వైన్ నుండి సహాయక బృందాలతో సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని మంటలను అదుపులోకి తెచ్చారని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు షేర్ చేశారు. ఆ వీడియోలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి పోరాడుతుండగా, భారీ పొగల మధ్య మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక భవనం యొక్క కాలిపోయిన అవశేషాలు, కనీసం ఒక డజను కార్లు ఫోటోలను వీడియోలో చూడవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com