యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్
- February 17, 2023
అమెరికా: భారత సంతతికి చెందిన వారు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన పలు సంస్థలకు అధిపతులుగా రానిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ పని చేస్తున్నాను. కాగా తాజాగా మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పదవిని పొందారు. ప్రముఖ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్‌కు నీల్ మోహన్ అనే భారత సంతతి వ్యక్తి సీఈవోగా నియమితులయ్యారు. సంస్థకు అత్యధిక కాలం సీఈవోగా పని చేసిన సూసన్ వొజిసికి తాజాగా పదవి నుంచి వైదొగడంతో మోహన్‌ను కొత్త సీఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
నీల్ మోహన్ ఇండియన్-అమెరికన్. సీఈవోగా బాధ్యతలు చేపట్టే వరకు యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పని చేశారు. నీల్ మోహన్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2008లో ఆయన గూగుల్ సంస్థలో చేరారు. భారతీయులకు టాప్ కంపెనీల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం. యూట్యూబ్ నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న నీల్‌మోహన్‌కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. సుసాన్ వొజిసికి సంస్థకు చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన యూట్యూబ్‌ను అత్యంత విజయవంతంగా ముందుకు నడిపించారని ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







