పవన్ కల్యాణ్ ఆదుకున్న చిన్నారి రేవతి కన్నుమూత..
- February 17, 2023
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదుకున్న రేవంతి తుదిశ్వాస విడిచింది. నాలుగేళ్ల క్రితం విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఓ నిరుపేద కుటుంబం కలిసి తమ కుమార్తె రేవతి ఆరోగ్యం బాలేదని.. కండరాల వ్యాధితో బాధపడుతుందని తమకు ఏదైనా సహాయం చేయాలంటూ పవన్ ను అభ్యర్థించారు. చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్.. ఆమెకు ఆర్థిక సాయంతో పాటు ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ చిన్నారిని మైసూర్ లోని ఆశ్రమంలో చేర్పించారు. చిన్నారి కోలుకుంటుంది.. సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు శోకసంద్రం మిగిలింది. ఈరోజు రేవతి కన్నుమూసింది.
గత కొద్దీ రోజులుగా రేవతి మైసూరు ఆశ్రమంలో ఉంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటుంది. కానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. చివరికి ఈరోజు కన్నుమూసింది. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఎంతో బాధపడ్డారు. రేవతికి పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. ఓ చిన్నారి ఇలా బాధపడుతోందని తెలియగానే పవన్ ఆ కుటుంబాన్ని కలిశారు. రేవతిని ఒడిలో కూర్చొబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ చిన్నారి లేదని తెలిసి యావత్ ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ రేవతి కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







