NRI BRS మరియు జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు...
- February 17, 2023
కువైట్ సిటీ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ఎన్అర్ఐ BRS కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మరియు జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ ముత్యాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
BRS ఎన్అర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనలతో BRS మరియు జాగృతి కువైట్ తరపున నిత్యావసర సరుకులు (పండ్లు, కూరగాయలు) పంచడంతో పాటు కేక్ కట్ చేసి వేడుకలు చేసుకోవడం జరిగింది.
తెలంగాణ ప్రదాత కెసిఆర్ గారు తెలంగాణ సాధించి ఎంతో అభివృద్ధి చేయడంతోపాటు ఎన్నో అద్భుతమైన పధకాలు ప్రవేశపెట్టారు. మన పథకాలు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకి కూడా ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళ రాష్ట్రాలలో కూడా అమలు పరుస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా ఇండియా కూడా డెవలప్ అవ్వాలి అంటే అది కేవలం కెసిఆర్ వల్లనే అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కెసిఆర్ ని ప్రధాన మంత్రిగా చూడాలని BRS కువైట్ టీం తరుపున కోరుకుంటున్నాం అని అభిలాష మరియు వినయ్ పేర్కొన్నారు.
కెసిఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభిలాష ఆకాంశిస్తున్న అని పేర్కొన్నారు.
కెసిఆర్ పుట్టినరోజు కార్యక్రమంలో BRS కువైట్ ప్రెసిడెంట్ అభిలాష గొడిశాల, జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ ముత్యాల, సురేష్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







