ఫిబ్రవరి చివరి వరకు తీవ్రమైన చలిగాలులు
- February 18, 2023
కువైట్: ఫిబ్రవరి చివరి వరకు తీవ్రమైన చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ నిపుణుడు ఇస్సా రమదాన్ హెచ్చరించారు. సాధారణంగా ఈ సమయానికి వసంత కాలం ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి మధ్యలో ఈ చలి గాలులు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ప్రస్తుతం వాయువ్య గాలుల కారణంగా రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని రమదాన్ వివరించారు. నివాసితులందరూ జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పొలాలు, తీర ప్రాంతాలలో ఉండే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వారాంతపు ఉష్ణోగ్రతలు రాత్రిపూట 5 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గే అవకాశం ఉందని రమదాన్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







