జార్జ్ సోరో ప్రమాదకారి: విదేశాంగ మంత్రి జయశంకర్
- February 18, 2023
న్యూఢిల్లీ: ‘హిండెన్‌బర్గ్’ ఉదంతంతో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగొచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ తాజాగా మండిపడ్డారు. ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు రానప్పుడు సోరోస్ లాంటి వ్యక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలపై సందేహాలు లేవనెత్తుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్జ్ సోరోస్.. వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి అని కూడా జయశంకర్ పేర్కొన్నారు. దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇటువంటి వారు నిధులు మళ్లించొచ్చని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
హంగేరీలో పుట్టిన జార్జ్ సోరోస్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఇక, అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందన్న హిండెన్ బర్గ్ నివేదికపై భారత ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఇటీవల ఆయన ప్రశ్నించడం భారత్‌లో తీవ్రవివాదానికి దారితీసింది. భారత పార్లమెంటుకు, విదేశీ ఇన్వెస్టర్లకు మోదీ సమాధానం చెప్పకతప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగక..హిండెన్ బర్గ్ నివేదికతో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగొచ్చని పేర్కొన్నారు. దీంతో.. జార్జ్ సోరోస్.. భారత ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







