వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసిన ప్రబాస్.! టార్గెట్ రీచ్ అవుతాడా.?

- February 18, 2023 , by Maagulf
వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసిన ప్రబాస్.! టార్గెట్ రీచ్ అవుతాడా.?


యూనివర్సల్ స్టార్ అయిన ప్రబాస్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదో సంచలనమే. అయితే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ప్రభాస్ పరిస్థితి. అనౌన్స్‌మెంట్ అయిన ప్రాజెక్టులే అనుకున్న టైమ్‌కి రిలీజ్ కాకుండా పోతున్నాయ్. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆది పురుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమా కోసం టైమ్ లాక్ చేశారు. 

2024 సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ కె’ సినిమాని రిలీజ్ చేయబోతున్నామంటూ తాజాగా అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు మేకర్లు. దాంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నిండింది. కానీ, ఈ ఉత్సాహం ఉరకలెత్తుతుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇంత తొందరగా రిలీజ్ టైమ్ లాక్ చేసుకుంటే ఆ టైమ్‌కి పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేని పరిస్థితి. అసలే ఈ ఏడాది సైతం చాలా పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయ్. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com