టర్కీ-సిరియా భూకంపం: 45 వేలు దాటిన మృతుల సంఖ్య

- February 18, 2023 , by Maagulf
టర్కీ-సిరియా భూకంపం: 45 వేలు దాటిన మృతుల సంఖ్య

యూఏఈ: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 45 వేలు దాటింది. టర్కీలోనే దాదాపు 264,000 అపార్ట్‌మెంట్‌లు ధ్వంసమయ్యాయి. టర్కీలో మరణాల సంఖ్య 39,672 కాగా, పొరుగున ఉన్న సిరియాలో 5,800 మందికి పైగా మరణించారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మస్జీదులలో టర్కీ, సిరియాలో చనిపోయిన వారి కోసం అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు విపత్తు తర్వాత సిరియాలో మళ్లీ ఘర్షణలు జరిగాయి. ప్రభుత్వ బలగాలు భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న తిరుగుబాటుదారుల ఆధీనంలోని పట్టణమైన అటారెబ్ శివార్లలో షెల్లింగ్ చేశాయని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శుక్రవారం వెల్లడించింది. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ గడ్డ కట్టే వాతావరణం కారణంగా .. సహాయక చర్యలు అతికష్టంగా సాగుతున్నాయి. మరోవైపు భూకంపం సంభవించి 12 రోజులు గడవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టంగా మారింది. అయితే, కొందరు మాత్రం ఇంకా సురక్షితంగా బయటపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు 200 ప్రాంతాల్లో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్నట్లు టర్కీ ఉపాధ్యక్షుడు ఫువాట్ ఓక‌టే తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com