ట్రాఫిక్ రద్దీ నివారణకు ట్రక్కులపై నిషేధం

- February 18, 2023 , by Maagulf
ట్రాఫిక్ రద్దీ నివారణకు ట్రక్కులపై నిషేధం

మస్కట్: ఒమన్ లోని వివిధ గవర్నరేట్‌లలోని అనేక రహదారులపై ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఫిబ్రవరి 19న సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ట్రక్కులపై నిషేధం విధించారు. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), డైరెక్టరేట్ ఆఫ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ప్రకటన మేరకు.. 1- మస్కట్ గవర్నరేట్‌లోని ప్రధాన రహదారులు. 2- అల్ దఖిలియా రోడ్ (మస్కట్ - బిడ్బిడ్ వంతెన). 3- అల్ బతినా హైవే (మస్కట్ - షినాస్) రహదారులపై ట్రక్కుల రాకపోకలపై నిషేధం విధించారు. ట్రక్ డ్రైవర్లందరూ తమ భద్రత, రహదారి వినియోగదారుల భద్రత కోసం తాజాగా జారీ చేసిన సూచనలను పాటించాలని పోలీసులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com