రామబాణం నుండి ప్రత్యేకమైన వీడియో విడుదల
- February 18, 2023
హైదరాబాద్: లౌక్యం , లక్ష్యం సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న గోపీచంద్ – శ్రీవాస్ ల కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి రామబాణం అంటూ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ వివేక్ కూచిభోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో గోపీచంద్ కు జోడీగా డింపుల్ హయాతీ నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు , ఖుష్బూ నటిస్తున్నారు. నేడు మహా శివరాత్రి సందర్భంగా విక్కీస్ ఫస్ట్ యారో పేరుతో చిత్ర బృందం ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. పవర్ఫుల్ యాక్షన్ సీన్ లతో రూపొందించిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది
ఈ వీడియోలో చేతికి బాణం లాంటి లాకెట్ ని ధరించి రామబాణంలా గమ్యం వైపు దూసుకుపోయే దూకుడు గల యువకుడిగా గోపీచంద్ క్యారెక్టర్ ని మరింత పవర్ ఫుల్ గా దర్శకుడు శ్రీవాస్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియలో గోపీచంద్ అదిపోయే ఫైట్ సీక్వెన్స్ తో మ్యాచో మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. 45 సెకన్ల వీడియోలో గోపీచంద్ యాక్షన్ తో అల్లాడించాడు. ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు. 2023 సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







