ఏపీ, తెలంగాణకు జీఎస్టీ పరిహారం విడుదల
- February 18, 2023
న్యూ ఢిల్లీ: ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేసింది కేంద్రం. GST పరిహారం పెండింగ్ మొత్తం బకాయిలు ఈరోజు నుండి క్లియర్ చేయబడతాయని సమావేశంలో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. GST పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్ వరకు మొత్తం రూ. 16,982 కోట్లు క్లియర్ చేసినట్లు మంత్రి నిర్మల చెప్పారు.
ఈరోజు నాటికి ఈ మొత్తం నిధులు.. పరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ సొంత వనరుల నుండి విడుదల చేయాలని నిర్ణయించిట్లు వెల్లడించారు. జీఎస్టీ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.1,265 కోట్లు విడుదల చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఢిల్లీలో 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ చట్టం-2017కి లోబడి ఐదేళ్ల కాలవ్యవధికి సంబంధించిన అన్ని బకాయిలు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు మంత్రి నిర్మల. జీఎస్టీ పరిహారాలకు సంబంధించి ఇప్పటివరకున్న అన్ని బకాయిలను రాష్ట్రాలకు చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
జూన్ మాసానికి సంబంధించిన రూ.16,982 కోట్లను కూడా చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ చెల్లింపులకు అవసరమైన నిధులు ప్రస్తుతం అందుబాటులో లేవన్న ఆమె.. కేంద్రం సొంత ఆర్థిక వనరుల నుంచి ఈ చెల్లింపులు చేస్తామని వివరించారు. ఇప్పుడు విడుదల చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో పరిహార రుసుం వసూళ్ల నుంచి మినహాయించుకుంటామని నిర్మల చెప్పారు. మరోవైపు స్టేషనరీపై జీఎస్టీని 18 నుంచి 12శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







