మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడిన దుబాయ్ హిందూ దేవాలయం
- February 18, 2023
దుబాయ్: దుబాయ్ లో జెబెల్ అలీ లోని హిందూ దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. ఓం నమ:శివాయా అంటూ ఆలయం మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి శివుడుని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దుబాయ్ హిందూ దేవాలయం జనరల్ మేనేజర్ ఎన్. మోహన్ మాట్లాడుతూ.. తెల్లవారు జామున 4.30 నుంచే భక్తుల కోసం ఆలయాన్ని తెరిచామని తెలిపారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి శివరాత్రి రోజున దాదాపు 30-35 వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారని, శివరాత్రి మరునాడు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఆలయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్న మోహన్.. బ్యాచిలర్లు, పిల్లల తల్లులకు, ఫ్యామీలకు, వృద్ధులకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేశామన్నారు.కొత్త సంవత్సరం జనవరి 1ని పురస్కరించుకొని 25 వేలకంటే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, ఆ అనుభవంతో ఇప్పుడు వేలాది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ జనరల్ మేనేజర్ వెల్లడించారు. శివరాత్రి సందర్భంగా అందరికీ మంచి జరగాలని శుభాకాంక్షలు తెలిపారు.




తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







