టర్కీలో రెండవ ఫీల్డ్ హాస్పిటల్ ప్రారంభించిన యూఏఈ

- February 19, 2023 , by Maagulf
టర్కీలో రెండవ ఫీల్డ్ హాస్పిటల్ ప్రారంభించిన యూఏఈ

యూఏఈ: టర్కీలోని హటాయ్ లో  మేరం ఫీల్డ్ ఆసుపత్రి నిర్మాణాన్ని యూఏఈ ప్రారంభించింది. టర్కీలో యూఏఈ నిర్మించిన రెండవ ఆస్పత్రి ఇది. టర్కీ,సిరియాలో వినాశకరమైన భూకంపం 46,000 మందిని చంపింది. ఈ ప్రాంతంలో ఊహించలేని విధ్వంసం సృష్టించింది. యూఏఈ  అనేక సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది. అత్యవసర సామాగ్రి,  శోధన మరియు రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది, బాధితులకు చికిత్స చేయడానికి ఫీల్డ్ హాస్పిటల్‌లను కూడా ఏర్పాటు చేసింది. 5,524 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ప్రావిన్స్ లో 1.6 మిలియన్ల మంది జనాభా ఉంది. ఈ ఆస్పత్రిలో 2 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, 20 పడకలు, 12 ప్రైవేట్ ఇన్-పేషెంట్ వార్డులతో ఏకకాలంలో 200 మంది రోగులకు వసతి కల్పించవచ్చు. ఆసుపత్రి 2,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. రెండు ఆపరేటింగ్ గదులు, అలాగే ప్రయోగశాల, ఎక్స్-రే సేవలను ఏర్పాటు చేశారు. ఇందులో స్థానిక టర్కిష్ వైద్యులు, నర్సులు సెవలు అందిస్తున్నారు. భూకంపానికి ముందు ప్రావిన్స్‌లోని ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులు ఇక్కడ బాధ్యతలు తీసుకోనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి సయీద్ థానీ హరేబ్ అల్ ధాహెరి, మెడికల్ కార్ప్స్ అధిపతి బ్రిగేడియర్ సర్హాన్ ఎం అల్ నెయాది, హటాయ్ జిల్లా గవర్నర్ యాసిన్ ఓజ్‌టర్క్, హటాయ్ మేయర్ మెహ్మెట్ హసియోగ్లుతో సహా పలువురు ప్రముఖులు ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com