బహ్రెయిన్ సంచలన నిర్ణయం..
- February 19, 2023
మనామా: బహ్రెయిన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పాశ్చరైజ్ చేయని పాలు ),దాని సంబంధిత ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించింది.ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో దుకాణదారులకు కీలక సూచనలు చేసింది. పాశ్చరైజ్ చేయని పాలు, ఆ పాలతో తయారు చేసే ఉత్పత్తులను ఎట్టిపరిస్థితులలో విక్రయించకూడదని స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లైసెన్స్ పొందిన పాల కేంద్రాల నుంచి పొందిన పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని తన ప్రకటనలో పేర్కొంది.
ఇక పాశ్చరైజ్ పాలలో సూక్ష్మజీవులను తొలగించడానికి తగిన ప్రాసెస్ ఉంటుంది.అలాగే మంచి ప్యాకింగ్ కూడా లభిస్తుంది. అలాంటి పాల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. నాణ్యతలేని, కలుషితమైన పాలను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడతారని అధికారులు తెలిపారు. 'పాలు చాలా త్వరగా పాడైపోయే ఆహారం. అదే సమయంలో కలుషితం అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. నాణ్యతలేని పాల ఉత్పత్తులను ఎట్టిపరిస్థితులలో విక్రయించవద్దు' అని ఆరోగ్యశాఖ చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







