ఏపీలో పలుచోట్ల భూప్రకంపనలు
- February 19, 2023
అమరావతి: ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. పల్నాడు అచ్చం పేట మండలంలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లిలో భూమి స్వల్పంగా కపించింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీర్ల పాడు మండలాల్లో భూకంపం ఏర్పడింది.
ఆదివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు.. ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు పెట్టారు. అటు పులించింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భూకంపాలు పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. రీసెంట్ గా టర్కీ, సిరియా దేశాల్లో వరుస భూకంపాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే సుమారు 40 వేల మంది చనిపోయారు. ఇటీవల కాలంలో జరిగిన ప్రకృతి అతి పెద్దదిగా చెబుతున్న ఈ భూకంపం ధాటికి ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







