లక్కీ ఛామ్ అయిపోయిన పవన్ హీరోయిన్.!
- February 20, 2023
‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుందీ మలయాళ కుట్టీ. తదుపరి ‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. వెరీ లేటెస్ట్గా ‘సార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ సినిమాలో ట్రెడిషనల్ లుక్స్‌తో కనిపించి విశేషంగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతోంది సంయుక్తా మీనన్. కాగా, అతి త్వరలోనే మరో క్రేజీ మూవీతో రాబోతోందీ అందాల భామ.
‘విరూపాక్ష’ సినిమా కోసం మరోసారి మెగా కాంపౌండ్‌ని టచ్ చేసింది సంయుక్త మీనన్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘విరూపాక్ష’ సినిమాలో సంయుక్త హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. తెలుగులో తొలి సినిమా నుంచీ ఓటమి అనేదే తెలియకుండా దూసుకెళ్తున్న సంయుక్త మీనన్‌కి ‘విరూపాక్ష’ కూడా హిట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయ్. యాక్సిడెంట్ తర్వాత తేజు నుంచి వస్తున్న సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్ జోనర్లో వస్తున్న సినిమా ఇది. సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







