వెంకీ కూడా ప్యాన్ ఇండియాని టార్గెట్ చేశాడా.?
- February 20, 2023
విక్టరీ వెంకటేష్ ఆచి తూచి సినిమాలు చేస్తుంటాడు. కథ, పాత్ర నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఆలోచించడు. అలాగే రీసెంట్గా యంగ్ హీరో విశ్వక్ సేన్ కోసం ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. ఇక, ఇప్పుడు సోలో హీరోగా ‘సైంధవ్’ అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ యాక్షన్ గ్లింప్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమాని వెంకీ సోలో మూవీగా అనుకుంటే, ఇదో మల్టీస్టారర్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ యాడ్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఇంపార్టెంట్ రోల్లో నవాజుద్దీన్ నటిస్తున్నాడు. తాజాగా తమిళ హీరో ఆర్య కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తాజా సమాచారం.
సరికొత్త పాత్రలో ఆర్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. సౌత్‌లోని అన్ని లాంగ్వేజెస్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ ‘సైంధవ్’ని రిలీజ్ చేయనున్నారు. అలా, ‘సైంధవ్’ తో విక్టరీ వెంకటేష్ కూడా ప్యాన్ ఇండియాని టచ్ చేయబోతున్నాడన్న మాట.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







