ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భారతీయ మహిళ
- February 21, 2023
కువైట్: ఓ భారతీయ మహిళ ఫిబ్రవరి 19న తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కువైట్ లోని ఫహాహీల్‌లో జరిగింది. మృతురాలిని తమిళనాడుకు చెందిన అఖిలా కార్తీగా గుర్తించారు. ఫహాహీల్‌లోని తమ అపార్టుమెంట్ ఆరో అంతస్తు నుంచి దూకే ముందు ఆమె తన ఇద్దరు పిల్లలను(10 సంవత్సరాల కుమారుడు, 12 సంవత్సరాల కుమార్తె) ఊపిరాడక చంపేసిందని పోలీసులు తెలిపారు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని గుర్తించారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉండటం, ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులు డోర్లను బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో పిల్లలిద్దరూ శవమై పడి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న అఖిలా కార్తీ, ఆమె భర్త ఇద్దరూ ఇంజనీర్లు. తమిళ అసోసియేషన్ కువైట్‌లో అఖిలా కార్తీ క్రియాశీల సభ్యురాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







