రేపటి నుంచి హైదరాబాద్‌లో 20వ బయోఆసియా సదస్సు..
- February 23, 2023
హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక 20వ అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు శుక్రవారం ప్రారంభమవనుంది. నేటి నుంచి 26వ తేదీ వరకు హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరిశ్రమ, విద్యాసంస్థలను(అకాడమీ)ని అనుసంధానించడమే లక్ష్యంగా బయో ఆసియా ఫోరం పనిచేస్తోంది. ఇందులో భాగంగా బయోఆసియా సదస్సులను ఈ ఫోరం నిర్వహిస్తోంది. ప్రభుత్వం, నియంత్రణ అథారిటీలు, స్టేక్ హోల్డర్లు మధ్య సమన్వయం సాధించి హెల్త్‌కేర్ రంగ వృద్ధికి బయో ఆసియా ఫోరం దోహదపడుతోంది. ఈసారి సదస్సు అడ్వాన్సింగ్ ఫర్ వన్ : షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్ అనే థీమ్‌తో సదస్సు జరగనుంది. భారతదేశ లైఫ్‌సైన్సెస్ రంగంలో బయోఆసియా సదస్సుది కీలక పాత్ర వహించనుంది. ఈ సదస్సులో 100కుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నోబెల్ అవార్డు గ్రహీతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







