శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- February 23, 2023
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం భారీగా బంగారం పట్టుబడింది.కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి 23 మంది సూడాన్ మహిళా ప్రయాణికులు గ్రూప్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.బంగారాన్ని వివిధ చోట్ల దాచి తరలించే ప్రయత్నం చేశారు లేడీ కిలాడీలు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. దీంతో సూడాన్ జాతీయులు అడ్డంగా బుక్ అయ్యారు.నిందితుల వద్ద నుంచి 14.906 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.బంగారం విలువ రూ.7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు.మిగిలిన వారిని అధికారులు విచారిస్తున్నారు. నిందితులు షూకింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని బంగారం తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







