ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం
- February 24, 2023
విజయవాడ: ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..జస్టిస్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణం చేయించారు.
గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం జగన్, చీఫ్ జస్టిస్ మిశ్రా.. గవర్నర్ నజీర్ కు పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ నజీర్ కర్ణాటకలోని బెలువాయి గ్రామానికి చెందినవారు. 1958 జనవరి 5న జన్మించారు. బాల్యం అంతా మూడబిదరిలోనే గడిచింది. స్థానిక మహాబీర్ కళాశాలలో బీకాం చదివిన ఆయన ఆ తరువాత మంగళూరు కొడియాల్ బెయిల్ ఎస్డీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
2003 లో మొదటి సారిగా కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి ఏడాది హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 లో సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులైన ఆయన ఈ ఏడాది జనవరి 4 వరకూ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు.


తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







