తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- February 24, 2023
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 28న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది.
మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 10. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 12-14. ఏప్రిల్ 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌కు సంబంధించిన పరీక్షలు మే 7-9 వరకు జరుగుతాయి. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో జరుగుతాయి.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలుకాగా, ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ సందర్శించాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







