చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం.!
- February 24, 2023
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోగా పాపులర్ అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ప్రోగ్రామ్‌కి ముఖ్య అతిథిగా వెళ్లారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ షోకి అతిధిగా వెళ్లిన తొలి తెలుగు నటుడు చరణ్ కావడం విశేషం.
అలాగే, తొలి ఇండియన్ నటుడు కూడా రామ్ చరణే కావడం మరో విశేషం. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఈ టాక్ షోకి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు.
అలాగే, హాలీవుడ్ సినిమాలో నటించాలని వుందన్న తన మనసులోని కోరికను సైతం బయటపెట్టారు. హాలీవుడ్ డైరెక్టర్లు ఇండియన్ నటుల పైనా, తెలుగు సినీ నటులపైనా, కూడా ఫోకస్ పెట్టాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







