బర్త్ డే స్పెషల్.! అందుకే ఆయన నేచురల్ స్టార్.!
- February 24, 2023
తెరపై ఆయన కనిపించడు. ఆయన పాత్రలు మాత్రమే కనిపిస్తాయ్. అంతలా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తాడు నాని. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న హీరో నాని. అందుకే నేచురల్ స్టార్ అని నానిని ముద్దుగా పిలుచుకుంటారు.
చివరిగా ‘అంటే సుందరానికి’ అంటూ వచ్చాడు. అనూహ్యంగా ఈ సినిమా ఆశించిన విజయం అందించలేదు నానికి. త్వరలో ‘దసరా’ సినిమాతో మాస్ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధం చేశాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. అలాగే, ‘దసరా’ సినిమా నుంచి తప్పుకుని వెంటనే తన కొత్త ప్రాజెక్ట్‌లోనూ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.
తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సరికొత్త గెటప్‌లో నాని కనిపించబోతున్నాడని ఆయన తాజా లుక్స్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఇక, ‘దసరా’ సినిమాపై చాలా నమ్మకంగా వున్నాడు నాని. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ఈ రోజు ఆయన తన 39వ పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మనం కూడా నానికి బర్త్ డే విషెస్ చెప్పేద్దామా.! ఆయన ‘దసరా’ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్‌డే టు యూ నాని.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







