రహదారిపై మంటల్లో చిక్కుకున్న కారు.. భారీగా ట్రాఫిక్ జామ్
- February 24, 2023
దుబాయ్: దుబాయ్‌లోని అల్ ఖైల్ రోడ్లో మధ్యాహ్నం 1 గంటల సమయంలో కారులో మంటలు చెలరేగి దగ్ధం అయినట్లు పోలీసులు తెలిపారు. జుమేరా విలేజ్ సర్కిల్ సమీపంలో షార్జా, అబుధాబి వైపు ఎగ్జిట్ వద్ద కుడివైపు లేన్‌లో కారు వెళ్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అదే సమయంలో ఒక వ్యక్తి మంటలు ఆర్పే యంత్రంతో మంటలను ఆర్పేందుకు కష్టపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగిన సమయంలో షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డు వైపు అల్ ఖైల్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని దుబాయ్ పోలీసులు ధృవీకరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







