రహదారిపై మంటల్లో చిక్కుకున్న కారు.. భారీగా ట్రాఫిక్ జామ్

- February 24, 2023 , by Maagulf
రహదారిపై మంటల్లో చిక్కుకున్న కారు.. భారీగా ట్రాఫిక్ జామ్

దుబాయ్: దుబాయ్‌లోని అల్ ఖైల్ రోడ్‌లో మధ్యాహ్నం 1 గంటల సమయంలో కారులో మంటలు చెలరేగి దగ్ధం అయినట్లు పోలీసులు తెలిపారు. జుమేరా విలేజ్ సర్కిల్ సమీపంలో షార్జా, అబుధాబి వైపు ఎగ్జిట్ వద్ద కుడివైపు లేన్‌లో కారు వెళ్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అదే సమయంలో ఒక వ్యక్తి మంటలు ఆర్పే యంత్రంతో మంటలను ఆర్పేందుకు కష్టపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగిన సమయంలో  షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డు వైపు అల్ ఖైల్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని దుబాయ్ పోలీసులు ధృవీకరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com