హెచ్ఎంసీ అపాయింట్‌మెంట్ బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు

- February 25, 2023 , by Maagulf
హెచ్ఎంసీ అపాయింట్‌మెంట్ బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు

దోహా: ఔట్ పేషెంట్ అపాయింట్‌మెంట్ బుకింగ్ ప్రక్రియను మెరుగుపరచడానికి, రోగుల సంరక్షణను మెరుగుపరచడానికి సిస్టమ్ లో కీలక మార్పులు చేయనున్నట్లు హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) ప్రకటించింది. నేత్ర వైద్యం, చెవి, ముక్కు, గొంతు, యూరాలజీ, ఆడియాలజీ రోగులకు త్వరగా ప్రయోజనం చేకూరనుందని, అలాగే అంబులేటరీ కేర్ సెంటర్‌లో సాయంత్రం క్లినిక్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. కొత్త అపాయింట్‌మెంట్ బుకింగ్ సిస్టమ్‌ను అమలు చేయడం, వ్యక్తిగత ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ బృందాలతో సమన్వయంతో అపాయింట్‌మెంట్ మేనేజ్‌మెంట్ టీమ్‌ల నియంత్రణలో ప్రతి హెచ్‌ఎంసి ఆసుపత్రులలో కొత్త రిఫరల్ మేనేజ్‌మెంట్ విభాగాలను ఏర్పాటు చేయడం కొత్త సిస్టమ్ మార్పులలో ఉన్నాయని పేషెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్టాఫ్ ఎంగేజ్‌మెంట్ కోసం సెంటర్ ఫర్ క్వాలిటీ డిప్యూటీ చీఫ్,  హమద్ హెల్త్‌కేర్ క్వాలిటీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ నాజర్ అల్ నైమి వివరించారు. రిఫరల్, బుకింగ్ మేనేజ్‌మెంట్ వనరులతో క్లినికల్ టీమ్, సౌకర్యాలను కూడా శక్తివంతం చేస్తుందన్నారు.

ఈ ప్రాజెక్ట్ మార్చి 2022లో ప్రజారోగ్య మంత్రి అయిన హెచ్‌ఈ డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి మద్దతుతో ప్రారంభించబడింది. రెఫరల్‌కు సంబంధించి సమస్యలను గుర్తించడం, పరిష్కరించడం కోసం ఎండ్-టు-ఎండ్ బుకింగ్ ప్రక్రియ సమగ్ర సమీక్షను కలిగి ఉంది. ఇ -విచారణ, ఇన్-కాలింగ్, ఈ-అపాయింట్‌మెంట్ బుకింగ్ ప్రక్రియలు రోగులకు మెరుగైన సేవలు అందిస్తాయని అల్ నైమి తెలిపారు. మొదటి దశలో ఏడు హెచ్‌ఎంసి ఆసుపత్రులు, అంబులేటరీ కేర్ సెంటర్, హమద్ జనరల్ హాస్పిటల్, అల్ వక్రా హాస్పిటల్, అల్ ఖోర్ హాస్పిటల్, ఖతార్ రిహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్, ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అలాగే బోన్ అండ్ జాయింట్ సెంటర్, హమద్ డెంటల్ సెంటర్ లలో విజయవంతంగా కొనసాగుతుందని, ఈ సంవత్సరం మిగిలిన ఆసుపత్రులలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని అల్ నైమి చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ మార్చి 2022లో ప్రారంభించగా.. నిరీక్షణ జాబితాలలో 10,000 మంది రోగులు OPD బుకింగ్‌ల కోసం వేచి ఉన్నారు. సాయంత్రం క్లినిక్‌లను ప్రారంభించిన తర్వాత రోగుల అపాయింట్‌మెంట్‌ల నిర్వహణను సులభతరం చేయడానికి తాము ఈ సేవను నెస్మాక్ 16060 హాట్‌లైన్, హెల్ప్‌లైన్ సేవలకు జోడించనున్నారు. 16060 నెస్మాక్ కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్ 24 గంటలు, వారంలో ఏడు రోజులు అందుబాటులో ఉంటుంది. రోగులు 16060 నెస్మాక్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, ఆపై వారి రాబోయే అపాయింట్‌మెంట్‌లను మార్చాలనుకున్నా లేదా రద్దు చేయాలన్నా HMC సదుపాయాలలో నిర్వహించడానికి అపాయింట్‌మెంట్ హాట్‌లైన్ సేవను ఎంచుకోవచ్చు. 2022లో నెస్మాక్ బృందాలు వారి అపాయింట్‌మెంట్‌లకు సంబంధించిన విచారణలతో రోగుల నుండి 971,000 కంటే ఎక్కువ కాల్‌లను అందుకున్నాయి. సుమారు 25% మంది రోగులు వారి అపాయింట్‌మెంట్‌లకు హాజరు కావడంలో విఫలమయ్యారని డైరెక్టర్ నాజర్ అల్ నైమి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com