మతాన్ని కించపరిచేలా వీడియోలు.. ముగ్గురిపై ట్రయల్
- February 25, 2023
బహ్రెయిన్: తజ్‌దీద్ సొసైటీకి చెందిన ముగ్గురు సభ్యులు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులపై నాల్గవ మైనర్ క్రిమినల్ కోర్టులో విచారణ ప్రరంభమైంది. అనుమానితులపై ఇస్లాం మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలను అపహాస్యం చేశారని ఆరోపణల కింద కేసులు నమోదు చేశారు. మతపరమైన చిహ్నాలను, ఇస్లామిక్ విశ్వాసాన్ని బహిరంగంగా అపహాస్యం చేస్తూ సొసైటీ సభ్యులు యూట్యూబ్ వీడియోలను పోస్ట్ చేశారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. వారిపై బహ్రెయిన్ శిక్షాస్మృతి నిబంధనల ప్రకారం నిందితుల చర్యలు ప్రాథమికంగా నేరాలుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. భావప్రకటనా స్వేచ్ఛ హక్కును అంగీకరిస్తూనే, తాజ్‌దీద్ సొసైటీ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మించి ప్రవర్తించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ప్రజల మధ్య సామరస్యాన్ని దేబ్బతీశారని, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నారని, వారు తప్పుడు వాదనలు, విశ్వాసం రాజ్యాంగ హక్కును ఉల్లంఘించారని ప్రాసిక్యూటర్లు కోర్టులో తెలిపారు. కాగా, విచారణ సమయంలో ఇద్దరు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. నిందితుల తరఫు న్యాయవాదులు మరింత సమయం కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







