కంటి కురుపు బాధిస్తోందా.? ఈ చిన్ని టిప్ప్ పాఠించి చూడండి.!
- February 25, 2023
కంటి కొనలపై వచ్చే పుండు లేదా పొక్కును కంటి కురుపు అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తుంది. వాపు, చికాకు తెప్పిస్తుంటుంది. దీనికి ఏ విధమైన మెడిసెన్ యూజ్ చేయడానికి లేదు. కేవలం చిన్న చిన్న చిట్కాలే చికిత్స.
చేతి వేడిని ఆరారగా పెట్టడం ఓ చికిత్స అని తెలిసిన సంగతే. అయితే, మరికొన్ని వంటింటి చిట్కాలు కంటి కురుపును తగ్గించేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
అందులో ముఖ్యమైనది కలబంద. కురుపు వచ్చిన చోట చుట్టు పక్కల ప్రాంతాన్ని కలబందతో స్మూత్‌గా మసాజ్ చేయడం వల్ల అక్కడి వాపు నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
అలాగే, గోరు వెచ్చని నీటిలో తడిపిన శుభ్రమైన క్లాత్‌తో కురుపు వచ్చిన ప్రాంతాన్ని అద్దుతూ వుంటే కాస్త ఉపశమనం వుంటుంది.
సెలైన్ ద్రావణంలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా వుంటాయ్. అందుకే సెలైన్ వాటర్‌తో కంటి చుట్టుపక్కల తరచూ శుభ్రం చేయడం వల్ల వాపు, నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







