‘ఆర్ఆర్ఆర్’కి క్యూ కడుతున్న హాలీవుడ్ అవార్డులు.!
- February 25, 2023
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రిలీజై దాదాపు సంవత్సరం కావస్తున్నా.. ఈ సినిమా మేనియా తగ్గడం లేదు. సరికదా.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పోటెత్తుతున్నాయ్.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇటీవలే ‘నాటు నాటు..’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే, ఆస్కార్ నామినేషన్లలోనూ చోటు దక్కించుకుంది ఈ పాట. మార్చి 13న ఫైనల్ రిజల్ట్ తెలియనుంది.
ఇదిలా వుంటే, తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ ఖాతాలో మరో అవార్డు దక్కించుకుంది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే రామ్ చరణ్ బాణాల సన్నివేశాలు తమను ఎంతగానో ఇంప్రెస్ చేశాయని హాలీవుడ్ ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ వ్యాఖ్యానించడం విశేషం.
ఇలా అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ పేరు మార్మోగిపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ కేవలం సినిమా కాదు.. తెలుగు సినిమా గౌరవం. తెలుగు సినిమా ఖ్యాతి. తెలుగు సినిమా వైభవం.. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







