24 గంటల్లో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు
- February 26, 2023
అబుధాబి: ప్రవాసులు, నివాసితులు ఇంట్లోంచి కేవలం 24 గంటల్లోనే జనన, మరణ ధృవపత్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది యూఏఈ ప్రభుత్వం.ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో సంబంధిత ధృవపత్రం జారీ చేయడం జరుగుతుంది.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ గురువారం ప్రకటించింది.దీని కోసం ప్రత్యేక డిజిటల్ సర్వీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్లో ఉంటాయని పేర్కొంది.ఇక సర్వీస్ పొందేందుకు వినియోగదారులు ఒక్కొ సర్టిఫికేట్కు 60 దిర్హాములు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.ఈ సేవల కారణంగా వినియోగదారుల సమయం వృథాకాకుండా ఉండడంతో పాటు అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదని, అది కూడా ఒక వర్కింగ్ డేలో సర్టిఫికేట్ జారీ కావడం అనేది నిజంగా అద్భుతం అని మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు.అత్యావసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన సమయంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







